Karan Johar : టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు మ‌రియు న‌టుల‌కు ప్రాదాన్య‌త ఇస్తున్న కరణ్ జోహార్, బాలివుడ్ హీరోల భవిష్యత్ ఎంటి…..

0
70

Karan Johar  : కరణ్ జోహార్ ఈ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని వ్య‌క్తి. బాలీవుడ్‌లో నిర్మాత‌గా ద‌ర్శ‌కుడిగా ఎన్నో బాలీవుడ్ సినిమాల‌ను తెర‌కు ఎక్కించి విజ‌యాలు అందుకున్న‌రు. అంతేకాకుండా నిర్మాత‌గా ద‌ర్శ‌కుడిగా కాస్ట్మ్యూ డిజైన‌ర్‌గా ఎన్నో విజ‌యాలు సాదించారు. 2007లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ పోరం లో ప్ర‌తిస్టాత్మ‌క యంగ్ లీడ‌ర్స్ జాబితాలో ఒక‌రి చేరి అంద‌రిని ఆశ్చర్య‌ప‌రిచారు. టెలివిజ‌న్‌లో సైతం “కాఫీ విత్ క‌ర‌ణ్” షో తో అంద‌రిని ఆక‌ట్టుకున్నారు.

అయితె ఇప్ప‌డు టాలీవుడ్‌లో బాహుబ‌లి2, పుష్ప‌, RRR, వంటి సినిమాలు బాక్సాపిస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపించాయి. ఈ సినిమాలు అన్ని వెయ్యి కోట్ల‌కు పైగా క‌ల‌క్ష‌న్లు దూసుకుపోయాయి. దీనితో టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు మ‌రిము న‌టీన‌టుల మీద భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇప్పుడు దేశ‌వ్య‌ప్తంగా అంద‌రి దృష్టి టాలీవుడ్ ద‌ర్శ‌కులు మ‌రియు నటీన‌టుల‌పై ప‌డింది. అందులో ముందు వ‌రుస‌లో ఉన్న వ్య‌క్తి “క‌ర‌ణ్ జోహ‌ర్”.

karan johar about tollywood
karan johar about tollywood

దానిలో భాగంగా కరణ్ జోహర్ లైగ‌ర్ సినిమాకు కో-ప్రోడ్యుస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయున‌టువంటి పూరిజ‌గ‌న్న‌ద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతేకాక కరణ్ జోహార్ పాపులర్ షో అయినటువంటి “కాఫీ విత్ కరణ్” తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో ను తిరిగి మళ్లీ పునఃప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి గాను టాలీవుడ్ నటీనటులు అయినటువంటి అల్లు అర్జున్, రశ్మిక మదన్న, సమంత, ఎన్టీఆర్, రామ్ చరన్, పూజ హెగ్దే లతో ఈ షో ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భం లో బాలీవుడ్ దర్శకులు మరియు స్టార్ హీరోలకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే బాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకుల పరిస్ఠితి ఎంటీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.